Skip to main content

07.05.2017 వలస ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించండి : ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య --photos and pressnote

















వలస ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించండి : ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య
సిరిసిల్ల 7 , మే 2017:
 మైగ్రెంట్(వలస) ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య రెవిన్యూ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక వలస వెళ్లిన ఓటర్ల పేర్లను కాకుండా శాశ్వతంగా  వలస వెళ్ళిన వారిని ఓటర్ల జాబితా నుంచి  తొలగించాలని సూచించారు.
ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ బూతులలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను నిర్వహించారు . సిరిసిల్ల మండలం సర్దాపూర్ , పెద్దూర్ , సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కేంద్రీయ విద్యాలయం పోలింగ్ బూతులలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను రాష్ట్ర ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య పరిశీలించారు.
కొత్తగా ఓటరు నమోదు , ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులు, తొలగింపుల కై వచ్చిన దరఖాస్తు ల గురుంచి బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగారు .  ఫారంలను పరిశీలించారు . ఇప్పటికి నమోదు కానీ  18 సంవత్సరాలు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు.  గడిచిన ఆరు నెలలో ఎవరైనా ఓటర్లు మరణించి ఉంటే వారి పేర్లు జాబితా నుంచి తొలగించలన్నారు. shifted ఓటర్లను గుర్తించి డూప్లికేట్ కాకుండా జాగ్రత్త పడాలన్నారు . తిరిగి  ఈ నెల  14 తేదిన  అన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ జిల్లాలోని 13 మండలాల్లో  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతం కు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ఓటరు నమోదు పరిశీలకులు ఎం.వీరబ్రహ్మయ్య వివరించారు .
18 సంవత్సరాలు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు కావాలి : జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్
జిల్లాలో  18 సంవత్సరాలు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ పిలుపు నిచ్చారు .

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ బూతు లలో కొత్తగా ఓటరు నమోదు ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులుతొలగింపుల కై ఆదివారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను నిర్వహించా మన్నారు . తిరిగి ఈ నెల 14 న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను అన్ని అన్ని పోలింగ్ బూతు లలో నిర్వహిస్తామన్నారు .సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు  ఓటర్ల నమోదుఓటర్ల సవరణ కార్యక్రమం జయ ప్రదం అయ్యేలా చూడాలన్నారు . జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు . ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం  జూన్‌ 15 వరకు తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు .
ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రాజు , తదితరులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి