Skip to main content

13-05-2017:విస్తృత ప్రచారంతోనే చివరి గడపకి సంక్షేమ పథకాలు - డిపిఆర్ఓ దశరథం -- PHOTOS AND PRERSSNOTE





ప్రచురణార్థం

విస్తృత ప్రచారంతోనే చివరి గడపకి  సంక్షేమ పథకాలుడిపిఆర్ఓ దశరథం

సిరిసిల్ల 13,మే 2017:

తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ  అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అప్పుడే ప్రభుత్వ పథకాలు జిల్లాలోని  చివరి గడపకు చేరుతాయని అన్నారు .

శనివారం డిపిఆర్ఓ కార్యాలయంలో  తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో డిపిఆర్ఓ సమావేశమయ్యారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం,పేదలుబలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం  అమలు చేస్తుందని వీటిపై ప్రజలకు కళారూపాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
మిషన్‌ భగీరథమిషన్‌ కాకతీయడబల్‌ బెడ్‌ రూం ఇళ్లుఆసరా ఫించన్లుహరితహారంఇతర ప్రాధాన్యత  పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. జూన్ లో యాదవ, కురుమలకు ప్రభుత్వం గొర్రెలను యూనిట్లను రాయితీ తో అందించనున్నందున  ఆ పథకం  పై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు .
 ప్రభుత్వం ఎంతో ఉదార్థమైన లక్ష్యంతో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిందని ప్రభుత్వ ఆశయం మేరకు పని చేయాలన్నారు.
సమావేశంలో  టీం లీడర్లు ఎడమల శ్రీధర్‌రెడ్డి,ఆకునూరి దేవయ్య , సీనియర్ కళాకారులుఎడమల జిల్‌ నాందేవ్‌ కమ్మరి తిరుపతితో పాటుగా జిల్లా కళాకారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి