ఎన్నికల నియమావళి పటిష్ట అమలు కు చర్యలు తీసుకుంటున్నాం : జేసి సిరిసిల్ల , అక్టోబర్ 29: జిల్లాలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కు తెలిపారు . సోమవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు , , రిటర్నింగ్ అధికారులతో లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు .. ఈ సందర్భంగా రాష్ట్రంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు , సి - విజిల్ , పోలింగ్ సిబ్బంది డేటా బేస్ , తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమీక్షించారు . జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా , DRO శ్రీ ఖీమ్యా నాయక్ , rdo శ్రీనివాస రావు తదితరులు ఈ విసి కి కలెక్టరేట్ నందు హాజరయ్యారు. ఈ సందర్భం...