23.10.2018 -- PRESS NOTE AND PHOTOS -- ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి
సిరిసిల్ల 23, అక్టోబర్ 2018
జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి తెలిపారు .
మంగళవారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ నందు జిల్లాల ఎన్నికల అధికారులు ( కలెక్టర్ లు ) , ఎస్పీలతో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒపి రావత్ నేతృత్వంలో 11 సభ్యుల కేంద్ర ఎన్నికల బృందం సమావేశం నిర్వహించింది .
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి జిల్లా లో ఎన్నికల సన్నద్ధత పై సవివరంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించారు .
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్ల ను ఒపి రావత్ కు వివరించారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, ఎన్నికల నియమావళి, స్వీప్ కార్యక్రమాలు తదితర అంశాలపై కూలంకషంగా కేంద్ర ఎన్నికల అధికారులకు కలెక్టర్ వివరించారు .
ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ తో పాటు ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు .
Comments
Post a Comment