పారదర్శకంగా నిర్వహణకు ప్రత్యేక యాప్‌లు
జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి వెల్లడి
సిరిసిల్ల , అక్టోబర్ 25,
ఈ మేరకు అయన గురువారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేసారు .
ఎన్నికల్లో అధిక శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం, ఈవీఎం, వీవీప్యాట్‌పై సంపూర్ణ అవగాహన, ఎన్నికల్లో శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవడంతో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పలు మొబైల్ యాప్‌లను విస్తృతంగా వాడాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నుంచి ఈ యాప్‌లు ప్రారంభం కానున్నట్టు కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపింది.
ఇ-సువిధ యాప్...
ఎన్నికల ప్రచారం నిర్వహించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సౌకర్యార్థం ఇ-సువిధ యాప్‌ను భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇందులో ర్యాలీల నిర్వహణ, ప్రచార వాహనాల అనుమతి, ఎన్నికల కార్యాలయాలకు అనుమతి, లౌడ్ స్పీకర్లు, హెలిక్యాప్టర్లు, హెలిప్యాడ్‌ల అనుమతులను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. సంబంధిత రిటర్నింగ్ అధికారికి యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని దానకిషోర్ స్పష్టం చేశారు. పోలీసు నోడల్ అధికారి నిరభ్యంతర పత్రం పొందిన అనంతరమే అనుమతులు సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేస్తారు.

సి-విజిల్ యాప్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే గుర్తించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. పౌరులు తమ మొబైల్ యాప్‌తో ఫొటోలు లేదా రెండు నిమిషాల స్వల్ప వీడియోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు. జీఐఎస్ విధానంలో సంబంధిత రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి ఈ సమాచారం అందుతుంది. ఫిర్యాదుదారు చేసే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

------------------------------ ------------------------------ ------------------------------ ------------------------
issued by dpro rs
Comments
Post a Comment