Skip to main content

25-10-2018 దివ్యాంగులు ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు-- PRESS NOTE



దివ్యాంగులు ఓటు వేసేలా పోలింగ్ 

కేంద్రాల వద్ద ఏర్పాట్లు :


 జిల్లా ఎన్నికల

 అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి

జిల్లాలో  ప్రతి దివ్యాంగ ఓటరు సౌకర్యవంతంగా  తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి తెలిపారు .

ఈ మేరకు అయన గురువారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేసారు .
ఈ నెల 12 న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం  జిల్లా లో మొత్తం 4,412 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు . వీరందరూ  సౌకర్యవంతంగా  తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు .
ప్రతి దివ్యాంగ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం మరింత ధృడతరం కావడానికి సహకరించాలన్నారు .



దివ్యాంగులైన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద కల్పిస్తున్నప్రత్యేక  సౌకర్యాలు ఇవే :
·       గ్రౌండ్ ఫ్లోర్ లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. దివ్యాంగులకు తగిన విధంగా అన్ని ప్రమాణాలతో కూడిన ర్యాంపుల ఏర్పాటు.  పోలింగ్ కేంద్రం ద్వారం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ర్యాంపుల ఏర్పాటు.
·       పోలింగ్ కేంద్రాలలో చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లు ఏర్పాటు. త్రాగునీరు, ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం ఆడియో-వీడియో మాధ్యమాల ద్వారా తెలియజేయుట.
·       దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు క్యూలైన్లలో నిలబడనవసరం లేకుండా వెంటనే పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏర్పాటు.
·       స్థానిక అధికారులు/ సంబంధిత విభాగాల ద్వారా పోలింగ్ స్టేషన్లకు చేరుకొనుటకు సరైన రోడ్లు నిర్మాణం.
·       దివ్యాంగులైన ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు ప్రవేశించినప్పుడు బారికేడ్ల తొలగింపు.
·       వీల్ చైర్ ప్రవేశించుటకు అనుకూలంగా ప్రవేశద్వారం మరియు ఓటింగ్ కంపార్ట్ మెంట్ చుట్టూ ఏర్పాటు.
·       సాధ్యమైన చోట్ల దివ్యాంగ ఓటర్ల ప్రవేశానికి ప్రత్యేక ద్వారం ఏర్పాటు.
·       పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశానికి సంబంధించిన సైన్ బోర్డుల ఏర్పాటు.
·       పోలింగ్ కేంద్రాల సమీపం వరకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం.
·       మూగ, చెవిటి ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ.

·       అంధ  ఓటర్ల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్ లలో బ్యాలెటింగ్యూనిట్ల పై  బ్రెయిలీ గుర్తుల ఏర్పాటు.
·       రూల్-49N ప్రకారం అర్హత కలిగిన దివ్యాంగులు, అంధులు , అశక్తులైన ఓటర్లకు ఓటు వేయుటకు సహాయకుడిని తీసుకువచ్చుకొనే సౌకర్యం.
ISSUED BY DPRO RS

Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి