ఎన్నికలలో ఉపయోగించనున్న ఐ.టి అప్లికేషన్స్ పై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం: కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి
సిరిసిల్ల 25, అక్టోబర్ 2018
ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన ఐ.టి అప్లికేషన్స్ పై జిల్లా లో విస్తృత ప్రచారం నిర్వహించి .... వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూస్తామని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి తెలిపారు .
గురువారం హైదరాబాద్ నుండి జిల్లాల ఎన్నికల అధికారులు ( కలెక్టర్ లు ) తో ఎన్నికల ప్రధానాధికారి డా. రజత్ కుమార్ , ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి దూర దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు . సిద్ధిపేట కల్లెక్టరేట్ కార్యాలయం నుండి కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి ఈ దూర దృశ్య సమీక్షకు హాజరయ్యారు .
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి జిల్లాలో శాసన సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలు ,ఎన్నికలలో ఉపయోగించనున్న ఐ.టి అప్లికేషన్స్ పై విస్తృత ప్రచారం గురించి తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్,ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి వి వరించారు .
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ జిల్లా కలెక్టర్ లకు ఎన్నికల అంశాలు , ఐ.టి
అప్లికేషన్స్ సంబంధించి మార్గదర్శనం చేసారు .ఎన్నికల ప్రచారం నిర్వహించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సౌకర్యార్థం
ఇ-సువిధ యాప్‌ను,ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే గుర్తించేందుకు ఉద్దేశించిన సి-విజిల్ యాప్
ప్రయోజనాలను ప్రజలందరికి తెలిసేలా చేయాలన్నారు . ఈ ఐ.టి అప్లికేషన్స్ సంబంధించి రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారులు మార్గదర్శనం చేయాలన్నారు .
ISSUED BY DPRO RAJANNA SIRCILLA
Comments
Post a Comment