Skip to main content

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటరుగా నమోదు అవ్వాలి : కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి

మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం కు  సంబంధించి ఓటర్ల నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు .... కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లా లో   అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదవ్వాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి కోరారు .

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు .

షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన పట్టభద్రులు  అక్టోబర్‌ 1  నుంచి నవంబర్‌ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు  కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు . ముసాయిదా జాబితాను 2019 జనవరి 1న ప్రచురిస్తుందన్నారు .  మార్పులుచేర్పులకు జనవరి 31 వరకు గడువు నిచ్చిందన్నారు . ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 20న విడుదల చేయనుందని తెలిపారు . 

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కుపొందండిలా...


 2018 నవంబర్ 1వ తేదీకి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 2015 నవంబర్ నాటికి డిగ్రీతత్సమాన కోర్సుల్లో డిగ్రీ పొంది ఉండాలి.
 కనీసం మూడేళ్లు నియోజక వర్గ పరిధిలో నివాసం ఉండాలి.
 గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు అయ్యే వారు ఫారం-18ని పూర్తి చేసి స్థానిక తహశీల్దారు/ఎంపీడీఓ కార్యాలయాల్లో అందచేయాలి.
 గతంలో ఓటరుగా నమోదు అయిన వారు మరలా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి
 ఫారం-18తోపాటు డిగ్రీ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది.
 ఉపాధ్యాయులుప్రభుత్వ ఉద్యోగులు అయిన వారు సంబంధిత డిపార్ట్ మెంట్ అధికారిధృవీకరణతో పంపించాలి.
 సాధారణ ఓటర్ల జాబితాకుపట్టభద్రుల ఓటర్ల జాబితాకు ఎలాంటి సంబంధం లేదు.
  



Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి